త్రివిక్రమ్- బన్నీ మూవీకి భారీ బడ్జెట్
ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్(Sukumar) దర్శకత్వంలో పుష్ప2(Pushpa2) చేస్తున్నాడు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇండియాలోనే అత్యధిక బిజినెస్ జరిగిన మూవీగా పుష్ప2 రికార్డు సాధించింది. పుష్ప2 తర్వాత బన్నీ చేయనున్న సినిమాపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది.
బన్నీ(Bunny) తర్వాతి సినిమాను త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ అయినట్లు నిర్మాత నాగ వంశీ(Naga Vamsi) కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఎవరూ ఊహించని రీతిలో ఉండబోతుందని, దీని కోసం త్రివిక్రమ్ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారని చెప్పాడు. పుష్ప2 రిలీజయ్యాక బన్నీ ఎప్పడంటే అప్పుడు త్రివిక్రమ్ సినిమా మొదలవుతుందని నాగ వంశీ తెలిపాడు.
మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. బన్నీ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ భారీగా ఉండటం వల్ల బడ్జెట్ భారీగా పెడుతున్నారట. అల్లు అర్జున్ కెరీర్లోనే ఇప్పటివరకు టచ్ చేయని క్యారెక్టరైజేషన్ ను త్రివిక్రమ్ డిజైన్ చేశాడట. జనవరిలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ బయటకు రానున్నాయి.













