మరో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేయనున్న బన్నీ?
పెద్ద హీరోలకు మల్టీప్లెక్స్ బిజినెస్ బాగా కలిసొస్తుంది. అందుకే సక్సెస్ లో ఉన్న హీరోలు, బిజినెస్ చేయాలనుకుంటే వెంటనే ఈ బిజినెస్లోకే అడుగుపెడుతున్నారు. ఏఎంబీ మాల్ పేరుతో మహేష్ బాబు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేశాడు. అది బాగా క్లిక్ అవడంతో ఇప్పుడు బెంగుళూరులో మరో మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దానికి కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్గా వ్యవహరించబోతుంది.
మహేష్ ను చూసి విజయ్ దేవరకొండ కూడా మహబూబ్ నగర్లో ఓ మల్టీప్లెక్స్ ను ఓపెన్ చేసి సక్సెస్ఫుల్ గా నడుపుతున్నాడు. ఇక చెన్నైలో శివ కార్తికేయన్ కూడా ఏషియన్ వారి పార్ట్నర్షిప్లోనే ఈ బిజినెస్ చేస్తున్నాడు. వీళ్లతో పాటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రీసెంట్గా అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్ ప్లేస్ లో ఏషియన్ వారితో కలిసి ఓ మల్టీప్లెక్స్ ను స్టార్ట్ చేశాడు.
ఇప్పుడు అల్లు ఫ్యామిలీ హైదరాబాద్‌లోనే మరో మల్టీప్లెక్స్‌ను నిర్మించాలని చూస్తోందట. కోకాపేట్ ప్రాంతంలో మల్టీప్లెక్స్ ను ప్లాన్ చేస్తున్నారట. మరి దీన్ని కూడా ఏషియన్ ఫిల్మ్స్ తో నిర్మిస్తారా లేక సోలోగా ముందుకెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ మల్టీప్లెక్స్ కోసం బన్నీ ఇప్పటికే ల్యాండ్‌ను కూడా కొనేశాడని సమాచారం.













