Allu Arjun: పవన్ వల్లే త్రివిక్రమ్- బన్నీ ప్రాజెక్టు లేటవుతుందా?
సోషల్ మీడియా బాగా పెరిగిన నేపథ్యంలో ప్రతీదీ ఓ సెన్సేషన్ వార్తైపోతుంది ఈ రోజుల్లో. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మెగా అల్లు కాంపౌండ్ గురించి మరో కొత్త వార్త పుట్టుకొచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ఉన్న వివాదం వల్ల బన్నీ వాసు(Bunny Vas)ను పవన్ కళ్యాణ్ పక్కన పెడుతున్నాడని ఓ వర్గం అంటుండగా, దానికి ప్రతీకారంగా బన్నీ(Bunny) కూడా త్రివిక్రమ్(Trivikram) ను దూరంగా ఉంచుతున్నాడని మరికొందరు అంటున్నారు.
ఈ వార్తల్లో నిజమెంతన్నది పక్కన పెడితే ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బన్నీకి త్రివిక్రమ్ కథ చెప్పి చాలా కాలమే అవుతుంది. కాకపోతే పుష్ప2 వల్ల వీరి మూవీ లేటైంది. పుష్ప2(Pushpa2) తర్వాత బన్నీ డైరెక్ట్ గా త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్తాడనుకుంటే అట్లీ(Atlee)తో సినిమాను అనౌన్స్ చేసి దాన్ని ముందుగా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.
అట్లీ ప్రాజెక్టు చేస్తూనే మధ్యలో త్రివిక్రమ్ సినిమాకు కూడా డేట్స్ ఇస్తానని చెప్పడంతో త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్టు నుంచి బయటకు రాలేకపోతున్నాడు. అలాగని త్రివిక్రమ్ అడిగినప్పుడల్లా బన్నీ డేట్స్ ఇస్తాడా అంటే అది కుదిరే పని కాదు. కాబట్టి అట్లీ ప్రాజెక్టు అయ్యేవరకు త్రివిక్రమ్ ఎంతో సహనంగా ఉండాల్సిన పరిస్థితి. పవన్ తో సన్నిహితంగా ఉండటం వల్లే బన్నీ త్రివిక్రమ్ విషయంలో ఇలా చేస్తున్నాడని అందరూ అంటున్నారు. కానీ ఈ విషయంలో ఏ మాత్రం నిజం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే రీసెంట్ గానే పవన్, బన్నీ ఇద్దరూ కలుసుకుని దాదాపు గంట పాటూ మాట్లాడుకున్నారు కాబట్టి వారి మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేవనే చెప్పాలి.






