ఆ మూవీలో నటించటం లేదట
మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్‌ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నారనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కీలకపాత్ర అయిన మెగాస్టార్ అనుచరుడి పాత్ర చేయబోతున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతోంది. కాగా తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం బన్నీ ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేయటం లేదట. కాగా చిరంజీవి తెలుగు వెర్షన్ స్క్రిప్టు సిద్ధం చేయమని సుజీత్‌తో ఇప్పటికే చెప్పారట. సుజీత్ తెలుగు నేటివిటీకి దగ్గరగా లూసిఫర్ స్క్రిప్టును సిద్దంచేసే పనిలో ఉన్నారట. ఇక గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మిశ్రమ ఫలితాలను అందుకుంది. కాగా మెగాస్టార్ అనుచరుడి పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. ఆ పాత్ర సినిమాలోనే కీలకమైనది కాబట్టి. క్రేజ్ ఉన్న హీరోనే నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.













