బ్రహ్మానందాన్ని పరామర్శించిన బన్నీ
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ఏషియాన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో గత నెల 14న ఆయనకు గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మానందాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో బన్నీ ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మునుపటి లా చురుక్కా సినిమాలు చేయాలని, మరింత కాలం మనల్ని నవ్వించాలని ఆయన ఆకాంక్షించారు. ఫన్నీగా కన్నుకొడుతూ ఫొటోకు బ్రహ్మానందం ఇచ్చిన పోజు నవ్వులు పూయిస్తోంది. బ్రహ్మానందంతో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. బన్నీ, బహ్మ్రానందం కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.













