సైరా సంబరాలు
సైరా సూపర్ హిట్‌తో మెగా సంబరాలు మొదలైపోయాయి. గురువారం థాంక్స్ మీట్ పెట్టిన చిత్ర బృందం.. అదే రోజు రాత్రి మెగా పార్టీ చేసుకుంది. సైరా విజయాన్ని పురస్కరించుకొని అల్లు అరవింద్ ఇంట్లో సక్సెస్ పార్టీ గ్రాండ్‌గా జరిగింది. ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, రామ్‌చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అర్జున్, అల్లు శిరిష్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్, అఖిల్, శ్రీకాంత్, నవదీప్‌తో పాటు కొందమంది దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఇక మెగా ఫ్యామిలీలో ఓ సినిమా విజయవంతమైతే ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయడం అల్లు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది.శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ పార్టీ జరిగిందని సమాచారం.













