ఆ రెండు సినిమాల తర్వాతే పుష్ప3
ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పడం తెలుగు సినిమా దర్శకులకు ఈ మధ్య ఫ్యాషనైపోయింది. కేజీఎఫ్ సినిమాతో ఈ ట్రెండ్ బాగా బలపడింది. కేజీఎఫ్2 తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యష్ వేరే వేరే ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేయడం వల్ల కేజీఎఫ్3 కోసం ఆడియన్స్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పుష్ప మేకర్స్ కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప2 సెట్స్ పై ఉంది. ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్ చేయాలని డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ రేయింబవళ్లు ఈ సినిమాను ఫినిష్ చేయడానికి కష్టపడుతున్నారు. పుష్ప2 తర్వాత పుష్ప3 కూడా ఉంటుందని మేకర్స్ అన్నారు. కానీ పుష్ప3 వెంటనే స్టార్ట్ అవదట. పుష్ప2 తర్వాత బన్నీ మరో రెండు సినిమాలపై ఫోకస్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాలంటున్నాయి.
ఇప్పటికే అట్లీతో ఓ సినిమా కోసం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. దాంతో పాటూ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ఇప్పటికే అనౌన్స్ అయింది. ఈ రెండు సినిమాల తర్వాతే బన్నీ, పుష్ప3ని మొదలుపెట్టనున్నాడట. ఈ లోపు సుకుమార్ కూడా చరణ్ తో అనౌన్స్ చేసిన సినిమాను పూర్తి చేయాలి. మొత్తానికి కేజీఎఫ్3 లానే పుష్ప3 కూడా సెట్స్ పైకి వెళ్లాలంటే ఇంకొన్నేళ్ల సమయం పట్టే అవకాశముంది.













