Thandel: తండేల్ ఈవెంట్ కు గెస్టుగా బన్నీ
అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai pallavi) జంటగా చందూ మొండేటి(Chanddoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తండేల్(Thandel). ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్2(Geetha Arts2) భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు అల్లు అరవింద్(Allu Aravind) సమర్పకుడిగా వ్యవహరించగా బన్నీ వాసు(BUnny Vaasu) ఈ సినిమాను నిర్మించాడు. చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తండేల్ తెరకెక్కింది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తండేల్ మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇప్పటికే మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తూ బిజీబిజీగా ఉన్న టీమ్, త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తోంది. మొన్న వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ చేయగా ఇప్పుడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఫిబ్రవరి 2న జరిగే తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. తండేల్ నిర్మాత బన్నీ వాసు, అల్లు అర్జున్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్ కావడం వల్ల బన్నీ ఈ ఈవెంట్ కు రావడానికి ఒప్పుకున్నాడని సమాచారం. అయితే సంధ్య థియేటర్ ఘటన తర్వాత బన్నీ అటెండ్ కాబోతున్న ఫస్ట్ మూవీ ఈవెంట్ ఇదే. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగ చైతన్య తండేల్ హిట్ అవుతుందని ఎంతో ధీమాగా ఉన్నాడు.













