AA22xA6: బన్నీ-అట్లీ సినిమా… సమ్‌థింగ్ స్పెషల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్ లో వస్తున్న మూవీలో అభిమానులు ఇష్టపడేలా సీన్‌లు ఉంటాయని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రానున్న ఆ మూవీ బడ్జెట్ రూ.800 కోట్లు అని సమాచారం. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ బన్నీ కెరీర్‌లో హైలైట్‌గా నిలుస్తాయని టాక్. ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. సినిమాలో బన్నీ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని.. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో బన్నీ పాత్రకు సంబంధించి వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లోని యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. ఈ సీన్స్‌లో బ్రదర్ సెంట్‌మెంట్ కూడా చాలా ఎమోషనల్‌గా ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే, బన్నీ అభిమానులకు ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్‌గా నిలిచిపోతుందని వార్త.
డైరెక్టర్ అట్లీ బన్నీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందని మరో వార్త. ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్‌ను డిజైన్ చేస్తున్నాడట. మరి ఆ గెస్ట్ రోల్స్ కోసం అట్లీ ఎవర్ని అప్రోచ్ అవుతాడో చూడాలి. భారీ సెట్‌లో మేకర్స్ కీలక సీన్స్‌ను షూట్ చేస్తున్నారని సమాచారం. అయితే బన్నీ- అట్లీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎప్పుడెప్పుడు కొత్త అప్డేట్స్ వస్తాయోనని అంతా వెయిట్ చేస్తుంటారు. సినిమాకు వర్క్ చేస్తున్న వారు.. ఎవరు కనిపించినా విలేకరులు అడుగుతుంటారు. కానీ అప్డేట్ ఇచ్చేందుకు ఇప్పుడు ఓ ఒక్కరికి కూడా ఛాన్స్ లేదని తెలుస్తోంది. రీసెంట్‌గా బన్నీ, అట్లీ మూవీ పనులు పర్యవేక్షిస్తున్న నిర్మాత బన్నీ వాస్ కు ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ కొత్త మూవీ గురించి ఏమైనా చెబుతారా అని అడగ్గా.. నో అన్నారు. ఈ దశలో ఎటువంటి సమాచారం పంచుకోబోమని ఆయన స్పష్టం చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌తో అందరికీ నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ ఉందని కూడా వెల్లడిరచారు.
దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది నిజమేనని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ మొత్తం తారాగణం, సిబ్బందితో కఠినమైన నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ చేసుకుందట. బ్యానర్ తప్ప మరెవరూ కూడా అధికారిక అప్డేట్స్ ఇవ్వకూడదని తేల్చి చెప్పిందట. ఇంటర్నేషన్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఆ సినిమాలో ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె ఒక హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మూవీలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంతోపాటు విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తున్నారని సినీ వర్గాల్లో వినికిడి. పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ మార్కెట్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్‌పై కన్నేశాడు. అందుకు తగ్గట్టే దర్శకుడు అట్లీతో అనౌన్స్ చేసిన సినిమా ఫస్ట్ బాల్ తోనే సిక్సర్ కొట్టి దుమ్ము లేపాడు. ఇక ఇక్కడ నుంచి హాలీవుడ్ లెవెల్ స్టఫ్‌తో మాత్రమే ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడొక గ్లోబల్ ఫినామినాగా మారుతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ- సైన్స్ ఫిక్షన్ కేటగీరీలో ఇంటర్‌నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు, వీఎఫ్‌ఎక్స్ సహా పలు విభాగాల్లో చేస్తుండడం సినిమాకు మరింత క్రేజ్‌ను తెస్తుంది. సినిమా ప్రమోషన్స్ విషయం లోనూ మేకర్స్ వినూత్న రీతుల్లో ప్లాన్ చేయనున్నారట. ప్రస్తుతం అట్లీ బృందం హాలీ వుడ్ స్టూడియోతో కలిసి పని చేస్తోంది. ఇప్పుడు ఉన్నట్టుండి కోనెక్ట్ మోబ్‌సీన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా ఇ విస్కోంటి ముంబైలో అడుగుపెట్టడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. రెండు దశాబ్థాలకు పైగా పలు స్టూడియోలతో పని చేసిన అలెగ్జాండ్రా అవతార్, డూన్, జురాసిక్ వరల్డ్, బార్బీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సహా వంద పైగా చిత్రాలకు పని చేశారు. ముఖ్యంగా క్రియేటివ్ ప్రమోషన్స్ పరంగా అలెగ్జాండ్రా సుప్రసిద్ధులు. ఆమె మార్కెటింగ్ స్ట్రాటజీ అల్లు – అట్లీ సినిమాకి ప్రధాన బలంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. అలెగ్జాండ్రా ప్రస్తుతం ముంబై పరిశ్రమతో పాటు, ప్రాంతీయ భాషా చిత్రాలకు చెందిన దిగ్గజాలతో కలిసి పని చేస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.