Allu Arjun Atlee: అల్లు అర్జున్- అట్లీ సినిమాకు ఆ టైటిల్?

పుష్ప(Pushpa) ఫ్రాంచైజ్ సినిమాలతో తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). పుష్ప2(Pushpa2) సినిమా తర్వాత బన్నీ(Bunny) ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో అట్లీ(Atlee) దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు. దీంతో ఈ భారీ ప్రాజెక్టులో బన్నీ ఎలాంటి పాత్రలో నటిస్తాడనేది ఇంట్రెస్టింగ్ మారింది. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించడానికి అట్లీ సన్నాహాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఎన్నో టైటిల్స్ ను పరిశీలించిన తర్వాత అట్లీ ఈ సినిమాకు ఐకాన్(Icon) అనే టైటిల్ ను ఫిక్స్ చేయడానికి రెడీ అవుతున్నాడట. అయితే బన్నీ గతంలో ఇదే టైటిల్ తో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ తర్వాత ఎందుకో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.
ఇప్పుడు మరోసారి అదే టైటిల్ తో బన్నీ సినిమా చేయబోతుండటం ఆశ్చర్యంగా ఉంది. మరి నిజంగానే బన్నీ సినిమాకు అట్లీ ఐకాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తాడా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటుంది. జూన్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.