ఆ మ్యాటర్లో బన్నీని నమ్మలేం
గత రెండు మూడు రోజులుగా జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడంటూ నెట్టింట తెగ ప్రచారం జరుగుతుంది. నెల్సన్ కన్ను టాలీవుడ్ పై పడిందని, ఇందులో భాగంగా ఆయన చిరంజీవి, బన్నీలకు కథలు చెప్పాడని, అందులో బన్నీ సినిమా ఓకే అయ్యేట్లు ఉందని కాకపోతే వీరి కాంబో సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుందని టాక్స్ వినిపిస్తున్నాయి.
ఓ వైపు బన్నీ ఫ్యాన్స్ ఈ విషయంలో ఎగ్జైట్ అవుతున్నప్పటికీ బన్నీ గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఈ కాంబోలో సినిమా స్టార్ట్ అయినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు. దానికి రీజన్ లేకపోలేదు. బన్నీ ఇలా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ల కథలు వినడం, తర్వాత ఆ ప్రాజెక్ట్ లు వదిలేయడం ఆయనకు కొత్తేమీ కాదు. ఈ విషయంలో బన్నీని నమ్మలేం.
గతంలో ఫామ్ లో ఉన్న లింగుస్వామితో కొన్నేళ్ల పాటూ సంప్రదింపులు జరిపి సినిమా అనౌన్స్ చేసి తర్వాత వదిలేశాడు. ఆ తర్వా త మురగదాస్ తో కూడా బన్నీ డిస్కషన్స్ చేశాడు కానీ సినిమా చేసింది లేదు. విక్రమ్ కుమార్ తో కొంత కాలం ట్రావెల్ చేసి సినిమా చేయలేకపోయాడు బన్నీ. ఇక వేణు శ్రీరామ్‌తో ఐకాన్ అనే సినిమా అనౌన్స్ చేసి కూడా దాన్ని పక్కకు పెట్టేశాడు. దీంతో ఇప్పుడు నెల్సన్ కాంబోలో సినిమా వస్తుందని ఎన్ని వార్తలొచ్చినా బన్నీని నమ్మలేంలే అని ఫ్యాన్స్ లైట్ తీసుకుంటున్నారు.













