Allari Naresh: అన్నయ్యకు అల్లరోడి సలహా
ఈవీవీ సత్యన్నారాయణ(EVV Satyanarayana) కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ రాజేష్(Aryan Rajesh) గురించి అందరికీ తెలిసిందే. హాయ్(Hai) సినిమాతో హీరోగా పరిచయమైన అతను తర్వాత ఎన్నో సినిమాలు చేశాడు కానీ హీరోగా అనుకున్నంత సక్సెస్ అవలేకపోయాడు. రాజేష్ గ్లామర్ కు టాలీవుడ్ లో స్టార్ హీరో అవుతాడనుకున్నారు కానీ అది జరగలేదు.
దీంతో కొన్ని సినిమాలు చేశాక సక్సెస్ లేక నటించడం మానుకున్నాడు. అయితే ఈలోపే రాజేష్ తమ్ముడు నరేష్(Allari Naresh) హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. వాస్తవానికి నరేష్ హీరోగా క్లిక్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ అతనిలోని కామెడీకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యి అతన్ని యాక్సెప్ట్ చేశారు. ఇదిలా ఉంటే రాజేష్ మళ్లీ రెండేళ్ల కిందట హలో(Hello) వరల్డ్ అనే వెబ్ సిరీస్లో నటించడంతో మళ్లీ నటుడిగా కంబ్యాక్ అవుతున్నాడనుకున్నారు. కానీ ఆ సినిమా తర్వాత ఎలాంటి రాజేష్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు.
తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అన్నయ్యకు తాను విలన్ గా ట్రై చేయమని సలహా ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ లో విలన్లు లేక బాలీవుడ్ కు వెళ్లాల్సి వస్తుందని, రాజేష్ లాంటి వాళ్లు విలన్ గా టర్నింగ్ తీసుకుంటే మన డైరెక్టర్లు అంత దూరం వెళ్లే అవసరం ఉండదని నరేష్ తన అన్నయ్య రాజేష్ కు సలహా ఇచ్చాట. మరి తమ్ముడి సలహాని రాజేష్ ఏ మాత్రం ఆలకిస్తాడో చూడాలి.













