హిట్ సినిమా సీక్వెల్ ను అనౌన్స్ చేసిన అల్లరోడు
అల్లరి నరేష్(Allari naresh) హీరోగా తెరకెక్కిన బచ్చలమల్లి(Bachhalamalli) డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రిలీజ్ కు మరో మూడు వారాలున్నప్పటికీ చిత్ర యూనిట్ అప్పుడే ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. బచ్చలమల్లి ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన అల్లరి నరేష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
అల్లరి(Allari) సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన నరేష్ ఆ సినిమా హిట్ అవడంతో అల్లరి నరేష్ గా మారాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు తన నుంచి వచ్చిన ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లు మారింది. సుడిగాడు(Sudigadu) సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అల్లరి నరేష్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా మారాయి.
మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత రూటు మార్చి చేసిన నాంది సినిమా హిట్ అవడంతో ఆ పంథాలోనే సినిమాలు చేస్తున్నాడు. అయితే సీరియస్ గా నటించడం వల్ల పెద్ద హిట్లు దక్కవని భావించిన నరేష్ మళ్లీ కామెడీ వైపే అడుగులేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన సుడిగాడు సినిమాకు సీక్వెల్ చేయాలని డిసైడయ్యాడు. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న నరేష్, ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. 2026లో ఆ సినిమా ఉండనుందని నరేష్ వెల్లడించాడు.













