సర్దార్ సీక్వెల్ కు అంతా రెడీ
కోలీవుడ్ యాక్టర్ కార్తీ కెరీర్లో సర్దార్ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన ఫ్యాన్స్ ఖైదీ సీక్వెల్ తో పాటూ సర్దార్ సీక్వెల్ కూడా కావాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ సీక్వెల్ కు ఏర్పాట్లు జరగుతున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అనౌన్స్ చేశాడు.
ఇదిలా ఉంటే సర్దార్2 కు కూడా అన్ని ఏర్పాట్లు జరగుతున్నట్లు డైరెక్టర్ పీఎస్ మిత్రన్ ప్రకటించాడు. సర్దార్ సీక్వెల్ ను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు మిత్రన్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు మూడు నెలల పాటూ జరిగిందట. అజర్బైజాన్, కజకిస్తాన్ తో పాటూ జార్జియా ఇంకా పలు విదేశాల్లో ఈ సీక్వెల్ ను షూట్ చేయనున్నారట.
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సర్దార్2 స్క్రిప్ట్ రెడీ అయిందని, అతి త్వరలోనే సర్దార్2 షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సర్దార్2 లో విలన్ గా నటించబోతున్నాడని లీకులందుతున్నాయి. హీరోయిన్ గా ఆషికా రంగనాథన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. సర్దార్2 కోసం మిత్రన్ ఇప్పటికే చెన్నైలో ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా సర్దార్ ను మించి విజయం సాధిస్తుందేమో చూడాలి.













