దసరాను టార్గెట్ చేసిన టాలీవుడ్ హీరోలు
టాలీవుడ్ లో సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు అందరూ సెట్స్ లోనే ఉన్నారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, విజయ్ దేవరకొండ ఇలా అందరి సినిమాలు షూటింగ్ లోనే ఉన్నాయి. ఇందులో చిరంజీవి సినిమా తప్ప ఇతర హీరోలు ఇంకా తమ సినిమాల టైటిల్స్ ను ప్రకటించలేదు.
చిరంజీవి, వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న సినిమాను విశ్వంభర అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇక బాలయ్య- బాబీ కాంబోలో వస్తున్న బంగలయ్య109 సినిమా టైటిల్ ఏమై ఉంటుందని ఫ్యాన్స్ లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా కోసం బాబీ పవర్ఫుల్ టైటిల్ ను పెట్టనున్నాడని తెలుస్తోంది.
ఇకపోతే విక్టరీ వెంకటేష్- అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే వర్కింగ్ టైటిల్ ఉంది. కానీ ఇంకా టైటిల్ ను మాత్రం అధికారికంగా ప్రకటించింది లేదు. విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న సినిమా టైటిల్ ను కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ఈ సినిమా టైటిల్స్ అన్నీ ఒకేసారి దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరోలంతా ఒకేరోజు టైటిల్స్ ను రివీల్ చేసే ఛాన్సుంది.













