Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూపులన్నీ దానిపైనే

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) తాజా సినిమా వార్2(War2) పై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆశలు తీరేలా కనిపించడం లేదు. వార్2 కోసం ఎన్టీఆర్(NTR) పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయని అందరూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టి ప్రశాంత్ నీల్(Prasanth Neel)- ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపైనే ఉంది.
వార్2 తర్వాత తారక్(Tarak) నుంచి రాబోతున్న సినిమా కావడంతో అందరూ ఈ సినిమాపైనే ఫోకస్ పెట్టారు. దానికి తోడు ఈ సినిమాలో ఎన్టీఆర్ తన కెరీర్లో మునుపెన్నడూ లేనంత స్టైలిష్ గా చాలా కొత్తగా కనిపించనుండటంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఆతృతగా ఉన్నారు. ఈ సినిమాకు డ్రాగన్(Dragon) అనే టైటిల్ ను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.
డ్రాగన్ మూవీని ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ గా నిలపాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం నీల్ చాలా సమయం వెచ్చించాడని అన్నారు. అంతేకాదు, నీల్ కెరీర్లో కూడా ఇదే బెస్ట్ సినిమాగా నిలవనుందని ఆయన సన్నిహితులంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers), ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ గా నటించనుంది.