Akshaye Khanna: 50 ఏళ్ల వయసులో బాలీవుడ్ నటుడి పెళ్లి గురించి వార్తలు
బాలీవుడ్ లో సీనియర్ బ్యాచిలర్ గా ఉన్న వారెవరంటే ఎవరైనా ముందుగా చెప్పే పేరు సల్మాన్ ఖాన్(salman khan). 59 ఏళ్లైనా సల్మాన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అయితే బాలీవుడ్ లో కేవలం సల్మాన్ మాత్రమే కాదు, పెళ్లి చేసుకోని ఎంతోమంది సీనియర్లు బ్యాచిలర్ గానే ఉన్నారు. వారిలో అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) కూడా ఒకరు. ఆయన వయసు ఇప్పుడు 50 ఏళ్లు.
అయినప్పటికీ అక్షయ్ పెళ్లి చేసుకోలేదు. ఎన్నో ఏళ్లుగా అక్షయ్ ఖన్నా బాలీవుడ్ ఫేమస్ బ్యాచిలర్ గానే ఉంటున్నారు తప్పించి పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. అంతేకాదు, తనకు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని అక్షయ్ ఖన్నా ఇప్పటికే చాలా సార్లు ఓపెన్ గా చెప్పారు. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి ఆయన పెళ్లి వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
రియల్ లైఫ్ లో చాలా లో ప్రొఫైల్ మెయిన్టెయిన్ చేసే అక్షయ్ ఖన్నా రీసెంట్ గా దురంధర్(Durandhar) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో ఆడియన్స్ ను మెప్పించారు. అయితే ఒకప్పుడు అక్షయ్ ఖన్నా, కరీష్మా కపూర్(Kareeshma kapoor) చాలా క్లోజ్ గా ఉండేవారు. ఈ విషయం కరీష్మా తండ్రికి కూడా తెలిసి వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు కానీ కరీష్మా తల్లి బబిత(Babitha) వారి పెళ్లిని వ్యతిరేకించడంతో అక్షయ్ అప్పట్నుంచి ఒంటరిగానే ఉండిపోయారు. తర్వాత కరీష్మా పెళ్లి చేసుకుని ఇద్దరు పిలల్లకి తల్లి అయింది. ప్రస్తుతం కరీష్మా భర్తకు దూరంగా ఉంటుండటంతో ఇప్పుడైనా వారిద్దరూ కలిస్తే బావుంటుందని నెటిజన్లు తమ అభిప్రాయలను నెట్టింట వ్యక్తపరుస్తున్నారు.













