అఖిల్ నెక్ట్స్ స్టార్ట్ అయ్యేదప్పుడే!
అక్కినేని వారసుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. ఎంతో గ్రాండ్ గా అఖిల్ సినిమాతో అరంగేట్రం చేశాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి అఖిల్ ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ఫర్వాలేదనిపించాయి కానీ మంచి హిట్లని చెప్పలేం.
అఖిల్ నుంచి వచ్చిన ఆఖరి సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఇప్పుడు అఖిల్ కు అర్జెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ పడాల్సిన అవసరమొచ్చింది. ఇలాంటి టైమ్ లో అఖిల్, అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మార్చి రెండో వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, రెండో వారంలో సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయింది. దీంట్లో హోంబలే ఫిల్మ్స్ సంస్థ కూడా భాగస్వామి కానున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. అతి త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సుంది.













