Akhil Akkineni: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్(akkineni akhil), తన ప్రియురాలు జైనబ్ రవ్‌జీ(Zainab Ravzee) తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ రోజు ఉదయం మూడు గంటలకు వేద మంత్రాల సాక్షిగా వీరి పెళ్లి జరిగింది. జూబ్లిహిల్స్ లోని నాగార్జున(nagarjuna) ఇంట్లో వీరి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లిలో ఇరు కుటుంబ సభ్యులతో పాటూ అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.
అఖిల్ పెళ్లికి చిరంజీవి(Chiranjeevi)- సురేఖ(Surekha), చరణ్(Charan)- ఉపానస(Upasana)తో పాటూ శర్వానంద్(Sharwanand), డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel) హాజరయ్యారు. పెళ్లి తర్వాత బరాత్ జరగ్గా అందులో నాగ చైతన్య పాల్గొన్నాడు. జూన్ 8న అఖిల్- జైనబ్ ల రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా జరగనుండగా, ఈ రిసెప్షన్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటూ పారిశ్రామిక వేత్తలు కూడా అటెండ్ కానున్నారు.
అయితే గతేడాది నవంబర్ లోనే అఖిల్- జైనబ్‌కు నిశ్చితార్థం జరిగింది. ఆ టైమ్ లో చైతన్య పెళ్లి పనులు ఉండటం వల్ల అఖిల్ పెళ్లిని పోస్ట్‌పోన్ చేశారు. జైనబ్ రవ్‌జీ హైదరాబాద్‌లోనే పుట్టింది. ఆమె ఒక ఆర్టిస్ట్. జైనబ్ తండ్రి జుల్ఫీ రవ్‌జీ కన్‌స్ట్రక్షన్ రంగంలో పెద్ద బిజినెస్ మ్యాన్ అని సమాచారం. అఖిల్ పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.