Lenin: లెనిన్ కోసం అఖిల్ యాక్షన్ ప్రాక్టీస్
అక్కినేని అఖిల్(akkineni akhil) కు ఎంత ప్రయత్నిస్తున్నా సక్సెస్ అనేది దరి చేరడం లేదు. ఏ సినిమాకు ఆ సినిమా విషయంలో అఖిల్ ఎంతో కష్టపడుతున్నప్పటికీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం అఖిల్ కు దక్కడం లేదు. ఏజెంట్(agent) సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంటాడని అందరూ అనుకున్నారు కానీ ఆ సినిమా టాలీవుడ్ లోని అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
దీంతో ఎలాగైనా భారీ హిట్ కొట్టి ఆడియన్స్ ను, ఫ్యాన్స్ ను మెప్పించాలని అఖిల్ తర్వాతి సినిమాకు ఎన్నో జాగ్రత్తలు, ఎంతో టైమ్ తీసుకుని మరీ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బూరి(murali kishore abburi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ మొదలైంది.
లెనిన్(lenin) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ క్లైమాక్స్ కోసం అఖిల్ ప్రస్తుతం యాక్షన్ స్టంట్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే లెనిన్ క్లైమాక్స్ లో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉంటుందని అంటున్నారు. కానీ ఆ గెస్ట్ రోల్ ఎవరు చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. భాగ్య శ్రీ బోర్సే(bhagya sri borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.






