Akhanda2: అఖండ2 ఆ రికార్డును కొడుతుందా?
2025 అయిపోవచ్చింది. ఈ ఇయర్ లో చాలా భారీ సినిమాలుగా, ఎన్నో అంచనాలతో రాగా కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు కాగా మరికొన్ని సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. అయితే వాటన్నింటిలో ఫస్ట్ డే కలెక్షన్లలో టాప్ లో నిలిచినవి మాత్రం రెండే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డే1 రూ.100 కోట్ల క్లబ్ లో ఇప్పటివరకు రెండే సినిమాలు చేరాయి. అవే కూలీ(coolie), ఓజి(OG).
లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వంలో రజినీకాంత్(Rajnikanth) హీరోగా నటించిన కూలీ సినిమా భారీ అంచనాలతో రిలీజై డే1 రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే డే1 మాత్రం కూలీ రికార్డులను సృష్టించింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వచ్చిన ఓజి సినిమా కూడా ఇదే రేంజ్ లో సక్సెస్ ను అందుకుంది. దీంతో ఇప్పుడు అందరి కళ్లూ అఖండ2(akhanda2) పై పడ్డాయి.
ఓపెనింగ్ డే రోజు అఖండ2 రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న అఖండ2 పై భారీ అంచనాలున్నాయి. అఖండ(Akhanda) సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో పాటూ బాలయ్య(Balayya)- బోయపాటి(boyapati) కాంబినేషన్, బాలయ్య అఘోరా గెటప్, మాస్ ఎలివేషన్స్, తమన్(Thaman) బీజీఎం..ఇలా ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. కానీ మొదటి రోజు రూ.100 కోట్ల కలెక్షన్లంటే మాటలు కాదు. కేవలం తెలుగు స్టేట్స్ లోనే కాకుండా అన్ని ఏరియాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తేనే ఇది సాధ్యమవుతుంది. చూడాలి మరి అఖండ2 ఆ లిస్ట్ లో మూడో సినిమాగా మారుతుందో లేదో.







