విశ్వాసం పూర్తి
స్టార్ హీరో అజిత్ నటిస్తున్న విశ్వాసం చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. పూణేలో జరిగిన చివరి షెడ్యూల్లో సాంగ్ సీక్వెన్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించారు. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయెల్ రోల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి యువకుడి పాత్ర కాగా మరొకటి వృద్ధుడి పాత్ర. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఇక శివ-అజిత్ కలయికలో వస్తున్న ఈ నాల్గువ చిత్రంపై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.













