Yuvina: అజిత్ కూతురు భలే గ్లామరస్ గా మారిందే!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారంతా ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లుగా మారుతున్నారు. ఆల్రెడీ తెలుగులో సంతోష్ శోభన్(Santhosh Shobhan), తేజ సజ్జ(Teja Sajja), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), శ్రీదివ్య(Sri Divya), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) పలు సినిమాల్లో నటించగా, ఇప్పుడీ లిస్ట్ లో యువీనా పార్థవి(yuvina parthavi) కూడా జాయినైంది. కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది యువీనా.
తన అమాయకత్వం, అల్లరి ఆడియన్స్ కు యువీనాను దగ్గర చేశాయి. మధ్యలో చదువుల కోసమని సినిమాలకు దూరమైన యువీనా ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ కు దగ్గరైంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, అప్డేట్స్ ను అందిస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. చిన్నప్పుడు బొద్దుగా ఉండే అమ్మడు ఇప్పుడెంతో గ్లామరస్ గా తయారైంది.
2013లో ఇవాన్ ఏ కమల్(Ivaan ye Kamal)మూవీతో తమిళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యువీనా, తర్వాత మంజాభైమా ప్యాలెస్, కత్తి లో నటించింది. స్టార్ హీరోలు సూర్య(suriya), అజిత్(Ajith) సినిమాల్లో కూడా బాలనటిగా నటించి మెప్పించింది యువీనా. ఈ చిన్నది తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించగా, అజిత్ తో కలిసి చేసిన వీరమ్(Veeram) మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యువీనాను ఇప్పుడు చూసిన వారంతా అజిత్ కూతురు అప్పుడే ఇంత గ్లామరస్ గా అయిపోయిందా అని కామెంట్స్ చేస్తున్నారు.













