ఆమె పేరు మారిస్తే ఈ దేశానికి ప్రధాని అవుతుందట!
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్యకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు జ్ఞానేశ్వర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. భారత రాజకీయాల్లో ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యకు మంచి భవిష్యత్తు ఉందని, ఆమె ఈ దేశానికి ప్రధాని కాదలుచుకుంటే ఆమె తన పేరును రోహిణీగా మార్చుకోవాలని జ్ఞానేశ్వర్ సూచించారు. చిరంజీవి, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని తాను అంతకుముందే కచ్చితంగా చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇక, 2024లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుందని, రియలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ పెళ్లి 2019లో జరుగుతుందని కూడా జ్ఞానేశ్వర్ జోస్యం చెప్పారు.













