Bollywood: బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ కు ఏఐ..
టెక్నాలజీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏఐ వాడకం కూడా బాగా ఎక్కువైంది. ప్రస్తుత రోజుల్లో ఏఐ కూడా మన జీవితాల్లో ఓ భాగంగా మారింది. అందుకే ఇప్పుడు ఏఐను బాలీవుడ్ కూడా ఫిల్మ్ మేకింగ్ మరియు మార్కెటింగ్ కోసం వాడుకోవాలని చూస్తోంది. ధర్మ ప్రొడక్షన్(dharma productions) లో క్రిస్మస్ కు రిలీజ్ కానున్న తు మేరీ మై తేరా, మై తేరా తు మేరీ(Tu meri mein tera, mein tera tu meri) మూవీని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ ప్రమోషన్స్ కోసం మేకర్స్ తాజాగా ఏఐతో రూపొందించిన ఓ మోషన్ పోస్టర్ ను క్రియేట్ చేయగా అది అందరినీ ఎంతో ఆకర్షించింది. చాలా మంది ఆడియన్స్ ఈ కొత్త స్ట్రాటజీని అభినందిస్తూ, దీన్ని ఒక బోల్డ్ మార్కెటింగ్ మూవ్ గా భావిస్తున్నారు. ఇలాంటి ప్రమోషన్స్ రీఫ్రెషింగ్ గా అనిపించడంతో పాటూ చాలా కొత్తగా ఉంటాయని మేకర్స్ ను ప్రశంసిస్తున్నారు.
కానీ మరికొందరు మాత్రం ఈ ట్రెండ్ చాలా ఆందోళనకరంగా ఉందని, ఇప్పటికే బాలీవుడ్ ఒరిజినాలిటీ విషయంలో ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొంటుందని, ఇలాంటి టైమ్ లో మార్కెటింగ్ కోసం ఏఐని అనుకరించడం కాస్త ప్రమాదమేనని అంటున్నారు. ప్రస్తుతం ఏఐ సరదాగా కనిపిస్తున్నప్పటికీ ముందు బాలీవుడ్ తన పునాదిని స్ట్రాంగ్ చేసుకోకపోతే ఫ్యూచర్ లో భారీ నష్టం జరిగే అవకాశముందని చాలా మంది భయపడుతున్నారు.






