Aha: అదిరిపోయే ప్లానింగ్ తో రాబోతున్న ఆహా
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికైనా, ఎంతటి సక్సెస్ల్లో ఉన్న వారికైనా సాధారణంగా ఒక్కోసారి డల్ ఫేజ్ నడుస్తూ ఉంటుంది. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కూడా గత కొంతకాలంగా కొంచెం వెనుకంజలో ఉందనే చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో ఫిక్షన్ కంటెంట్ లో కాస్త డల్ గా ఉన్న ఆహా(Aha), ఇప్పుడు కొత్త ఎనర్జీతో ముందడుగు వేస్తూ దూసుకెళ్లడానికి రెడీ అవుతోంది.
చెఫ్ మంత్ర: ప్రాజెక్ట్ కె లాంటి హిట్ షో లు కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి మళ్లీ రాబోతున్నాయి. త్వరలోనే ఇండియన్ ఐడల్ సీజన్4 ఫినాలే కూడా జరగనుంది. ఈ లైనప్ చూస్తుంటే ఆహా ప్లానింగ్ అదిరిపోయేలా ఉందని అర్థమవుతుంది. తెలుగు ఓటీటీలో తమ సత్తాను చాటి గత వైభవాన్ని తెచ్చుకోవడానికి ఆహా టీమ్ చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.






