Keerthy suresh: మహానటి తర్వాత 6 నెలలు అవకాశాలు రాలేదు
టాలీవుడ్ లెజండరీ నటి సావిత్రి(Savitri) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి(mahanati) సినిమా ఎంత పెద్ద సక్సెస్ అనేది ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. ఆ సినిమాలో కీర్తి సురేష్(keerthy suresh) హీరోయిన్ గా నటించి తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించింది. మహానటి(mahanati) మూవీతో ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందుకుంది కీర్తి సురేష్. అలాంటి సక్సెస్ తర్వాత మామూలుగా ఎవరికైనా అవకాశాలు క్యూ కడతాయి.
కానీ తనకు మహానటి తర్వాత వింత పరిస్థితులు ఎదురైనట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కీర్తి. మహానటి సక్సెస్ తర్వాత తనకు ఆరు నెలల పాటూ ఎలాంటి కొత్త అవకాశాలూ రాలేదని, కనీసం ఆ టైమ్ లో తన వద్దకు ఏ డైరెక్టర్ వచ్చి కథను కూడా చెప్పలేదని, ఆ సినిమా తర్వాత ఆడియన్స్ తనను స్పెషల్ క్యారెక్టర్లలోనే ఊహించుకున్నారని కీర్తి చెప్పింది.
అందుకే తనకు ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు రాలేదని, దర్శకనిర్మాతలు కూడా తనను మహానటి లాంటి క్యారెక్టర్లలోనే ఊహించుకున్నారని, అందుకే తనకు కథలు, క్రియేటివ్ క్యారెక్టర్లు ఎక్కువగా రాలేదని, ఆ 6 నెలల గ్యాప్ ను తాను మేకోవర్ కోసం వాడుకున్నానని, కొంచెం టైమ్ తీసుకుని ఓపికగా వ్యవహరించాక తనకు మళ్లీ ఛాన్సులొచ్చాయని వెల్లడించింది కీర్తి సురేష్. ఇక కెరీర్ విషయానికొస్తే కీర్తి నటించిన రివాల్వర్ రీటా(revolver rita) నవంబర్ 28న రిలీజ్ కానుంది.






