ఆదిత్య హాసన్ చేతిలో రెండు బంపరాఫర్లు
ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్. శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సిరీస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఈ సిరీస్ కు దర్శకత్వం వహించిన ఆదిత్య హాసన్‌కు ఇదే డెబ్యూ అయినప్పటికీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా సిరీస్ ను నడిపించాడు.
మధ్య తరగతి ఎమోషన్స్ ను ఆదిత్య ప్రెజెంట్ చేసిన తీరు ఆడియన్స్ ను కట్టిపడేసింది. సిరీస్ లో పిల్లలుగా నటించిన మౌళి, రోహన్ రాయ్‌లకు ఈ సిరీస్ ఎంతో పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ సెకండ్ సీజన్‌కు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సిరీస్ తర్వాత ఆదిత్య హాసన్ కు రెండు పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు వచ్చాయి.
నితిన్ హీరోగా తన సొంత బ్యానర్ లో సినిమా చేయడానికి ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. స్టోరీ కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది. రెండో సినిమా సితార బ్యానర్ లో ఓ ప్రాజెక్ట్ అని తెలియనుంది. ఇంకా హీరో హీరోయిన్లు ఎవరన్నది తెలియదు. స్టోరీ ఫైనల్ వెర్షన్ రెడీ అయ్యాక కథకు తగ్గ హీరోహీరోయిన్లకు తీసుకొస్తానని ఆదిత్యకు నాగవంశీ హామీ ఇచ్చాడట. ఒక సిరీస్ తో ఎంట్రీ ఇచ్చిన డెబ్యూ డైరెక్టర్ అయినా ఇంతకంటే ఏం కోరుకుంటాడు? ఏదేమైనా ఆదిత్య హాసన్ సుడి ఈ సిరీస్ తో తిరిగిపోయిందనే చెప్పాలి.













