సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న “ఆదిపర్వం”, ఆంధ్రా, తెలంగాణాలో పెరుగుతున్న థియేటర్స్
టాలీవుడ్ లో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన మూవీ "ఆదిపర్వం". ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ నేపథ్యంలో మరో 50 థియేటర్లు పెంచుకుంది. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటించారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషించారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా "ఆదిపర్వం" చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సంజీవ్ మేగోటి.
థియేటర్లలో "ఆదిపర్వం" విజయవంతంగా ఆడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఆనందం వ్యక్తం చేశారు. "ఆదిపర్వం"ను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న చిత్రంగా మొదలై బిగ్ మూవీ మారుతూ రోజురోజుకు థియేటర్లు పెంచుకోవడం చాలా సంతోషంగా ఉండన్నారు. సపోర్ట్ చేసి "ది బెస్ట్ మూవీగా నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, యాక్షన్ ఆకట్టుకుంటాయని, మంచు లక్ష్మీ గారికి పేరు తెచ్చే చిత్రమవుతుందన్నారు. అలాగే హనుమంతు క్యారెక్టర్ లో ఆదిత్య ఓం నటన హైలైట్ గా నిలుస్తుందన్నారు. త్వరలోనే ఈ సినిమా విజయ యాత్ర నిర్వహించనున్నట్టు. తెలిపారు













