స్వయంవరం ప్రకటించిన ఆదాశర్మ!
టాలీవుడ్ నటి ఆదాశర్మ తనకు పెళ్లి కొడుకు కావాలంటూ బహిరంగంగా వెల్లడించారు. అతడి రంగు, కులం, సోషల్ మీడియా ఫాలోయింగ్ ఇవేవీ తాను పట్టించుకోనని ట్విట్ చేసింది. అయితే ఉల్లిపాయలు తిననివాడు అయ్యుండాలని, ముఖంపై చిరునవ్వు చెదరకుండా మూడుపుట్టాల వంట అడే చేయాలన్ని డిషన్లు పెట్టింది. రెగ్యులర్గా షేవ్ చేసుకోవలని, సంప్రదాయ దుస్తులే ధరించాలని షరతులు విధించింది. ఆదాశర్మ అంతటితో ఆగలేదు. మందు, మాంసం ఇంట్లోనూ బయట నిషేధం అని సృష్టం చేసింది. అతడికి తాగేందుకు ఐదు లీటర్ల నీటిని ప్రతిరోజూ అందిస్తానని తెలిపింది. దాంతోపాటే, భారత్లోని అన్ని భాషల చిత్రాలపైనా సదభిప్రాయం కలిగి ఉండాలని, వాటిని ఆస్వాదించే మనసున్నవాడే తనను మనువాడొచ్చనని ట్విట్టర్లో వెల్లడించింది. మొత్తానికి ఆదాశర్మ ఏ ఉద్దేశంతో ఈ ట్విట్లు చేసిందోకానీ, నెటిజన్లు మాత్రం భారీగా స్పందిస్తున్నారు.













