త్రిష ఫామ్ చూస్తే మతి పోవాల్సిందే!
సీనియర్ హీరోయిన్గా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికీ మంచి అందంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంది. ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే త్రిష సీనియర్ అనే చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న అవకాశాలు ఇప్పుడు రావు. తెలుగులో అయితే త్రిషకు ఛాన్సులు కూడా రాలేదు. వచ్చినా సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ ఛాన్స్ వచ్చింది కానీ యంగ్ హీరోల పక్కన జోడీగా చేసే ఛాన్స్ మాత్రం రాలేదు. రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో త్రిష చేసిన పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లు అమ్మడుకు బాగా కలిసొచ్చాయి. ఈ రెండు సినిమాలు త్రిష కెరీర్‌కు బాగా హెల్ప్ అయ్యాయి.
పొన్నియన్ సెల్వన్ లో త్రిష అందానికి, అభినయానికి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలొచ్చాయి. ఈ సినిమాల తర్వాత త్రిషకు ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. ప్రస్తుతం విజయ్ సరసన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న లియో సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా దసరాకు రిలీజ్ కాబోతుంది.
ఇది కాకుండా అజిత్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా ఫైనల్ అయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మలయాళంలో టోవినో థామస్ హీరోగా వస్తున్న ఐడెంటిటీ మూవీలో కూడా త్రిష హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి త్రిష రెండు భాషల్లో మంచి ఫామ్ లో ఉందనే చెప్పాలి. ఈ సినిమాలు కూడా విజయం సాధిస్తే ఇక త్రిష కెరీర్‌కు ఢోకా ఉండదు.













