మరో రెండు ఆఫర్లు పట్టేసిన త్రిష
ఎప్పుడో 19 ఏళ్ల క్రితం హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన త్రిష ఇప్పటికీ తన హవా కొనసాగిస్తుంది. సాధారణంగా ఇంత సీనియర్ నటీమణులకు హీరోయిన్ ఛాన్స్ రావడం అనేది చాలా అరుదు. ఏదో అక్క, వదిన పాత్రలకే పరిమితం చేస్తారు డైరెక్టర్లు. కానీ త్రిష మాత్రం నాలుగు పదుల వయసులో కూడా హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంటుంది.
రీసెంట్గా వచ్చిన పొన్నియన్ సెల్వన్-2 సినిమాలో త్రిషను చూసిన వారంతా ఇన్ని రోజులు డైరెక్టర్లు త్రిషను ఎందుకు పట్టించుకోలేదని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ సరసన లియో సినిమాలో నటిస్తున్న త్రిషకు ఇప్పుడు మరో రెండు క్రేజీ ఆఫర్లు వచ్చాయి. అందులో మొదటిది అజిత్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్. మాగిజ్ తిరుమేని డైరెక్షన్ లో రానున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.
రెండోది ధనుష్ హీరోగా తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ధనుష్50. ఈ సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. కేవలం సినిమా ఛాన్సులే కాదు, భారీ మొత్తంలో రెమ్యూనరేషన్లు కూడా త్రిషకు ముడుతున్నట్లు తెలుస్తోంది. మరి వరుస ఛాన్సులతో సినిమాలు చేయనున్న త్రిష టాలీవుడ్ కు ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.













