సిల్క్ స్మిత బయోపిక్ లో శ్రీరెడ్డి
నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దివంగత నటి సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా నిర్మితమవుతున్న బయోపిక్‌లో శ్రీరెడ్డి లీడ్ రోల్ పోషించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. మధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. అంతేకాదు సిల్క్ స్మితతో తనను తాను పోల్చకుంటూ ఓ ఫోటోను కూడా విడుదల చేసింది. అయితే ఇప్పటికే సిల్క్ స్మిత బయోపిక్‌లో యాంకర్ అనసూయ నటించనున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ పుకార్లకు చెక్ పెట్టింది అనసూయ. సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించడం లేదని సృష్టం చేసింది.













