వీళ్ళు ఎన్ని సార్లు పార్టీలు మారుస్తార్రా బాబు!
2004 లో దివంగత నేత డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో అప్పుడు కాంగ్రెస్ లో….. 2014లో సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ భారతీయ జనతా పార్టీ (బిజేపీ)లో చేరారు. పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో వారు బిజెేపీ సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత వైసీపీ పార్టీలో చేరి.. పార్టీ అధ్యక్షుడు, అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌తో విభేదించి.. తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇక 2019 ఎన్నికలకు ముందు తిరిగి మళ్ళీ వైసీపీ పార్టీలో చేరి పార్టీ వ్యవహారాల్లో పాలుపంచుకున్నారు. అయితే వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ జగన్ వీరిని దూరంగానే పెట్టడంతో చివరికి సహనం నశించిన జీవిత తిరిగి మళ్లీ కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న జీవిత మరో సారి కాషాయ కండువా కప్పుకున్నారు.
తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు పాలిటిక్స్ ఫాలో అవ్వకపోతే.. ఏ నేత ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవడం కష్టంగా మారిపోయింది. బట్టలు మార్చినట్లుగా ఈజీగా పార్టీ మార్చేస్తున్నారు. సినీ నటి, దర్శకురాలు, వైసీపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీలు తిరిగి తిరిగి చివరికి తన సొంత గూటికి చేరుకున్నారు.సోమవారం నాడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు జీవితా రాజేశేఖర్. అయితే పార్టీ మారిన ప్రతిసారి రాజశేఖర్‌తో కలిసి జంటగా జంప్ చేసే జీవిత ఈసారి మాత్రం సింగిల్‌గానే పార్టీ మారారు. ఒక వైపు ఏపీ రాజకీయాలు హాట్ హాట్ టాపిక్ అవుతుంటే ఈ తరుణంలో కాషాయ కండువా కప్పుకుని బీజేపీ పార్టీలో అడుగుపెట్టింది జీవితా రాజశేఖర్. అయితే జీవితను పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్.. ఆమెకు కండువా వేయడానికి నిరాకరించారు. దీంతో తనకు తానే కాషాయ కండువా కప్పుకున్నారు జీవితా రాజశేఖర్.













