సినిమా ఫ్లాపైనా భాగ్యశ్రీకి నో డ్యామేజ్
ఈ వారం రిలీజైన సినిమాల్లో ఎక్కువ అంచనాలతో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. రవితేజ హీరో అవడం, హరీష్ శంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ ఆ సినిమాను డైరెక్ట్ చేయడం దానికి తోడు సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ బాగా ఉండటం వల్ల సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయి. అందుకే సినిమా మీద నమ్మకంతో మేకర్స్ ముందు రోజు రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్లు కూడా వేశారు.
కానీ తీరా సినిమా చూశాక అందరి ఆశలు నీరుగారిపోయాయి. నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ఆడియన్స్ కు లాస్ట్ ఆప్షన్ గా మిగిలిపోయింది. లాంగ్ వీకెండ్ ఉండటం వల్ల వసూళ్లు పర్వాలేదనిపిస్తున్నాయి కానీ లేదంటే మిస్టర్ బచ్చన్ కు ఇంకా గడ్డు పరిస్థితులెదురయ్యేవి. మిస్టర్ బచ్చన్ సినిమా వల్ల రవితేజ, హరీష్ శంకర్ ఇమేజ్‌కు కచ్ఛితంగా డ్యామేజ్ జరగడం ఖాయం.
అసలే ఈ మధ్య రవితేజకు హిట్లు లేవు. హరీష్ కూడా చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేశాడు. ఇది కూడా డిజాస్టర్ అయింది. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియాకి కూడా వరుసగా ఫ్లాపులు పడుతున్నాయి. వీరందరికీ ఈ సినిమా ఇబ్బందిగా మారగా, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేకు మాత్రం మిస్టర్ బచ్చన్ బాగానే కలిసొస్తుంది. ఈ సినిమాను చూసిన వాళ్లంతా ఆమెను బాగానే మెచ్చుకుంటున్నారు. తన అందాలకు ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోయారు. రిలీజ్ కు ముందే భాగ్యశ్రీ హైలైట్ అయింది. సినిమాలో కూడా హరీష్ ఆమెను అందంగానే చూపించాడు. తెలుగు నేర్చుకుని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. యాక్టింగ్ పరంగా కూడా ఫర్వాలేదనిపించింది. దీంతో అమ్మడి కెరీర్ కి ఈ సినిమా ఫ్లాప్ పెద్దగా ఎఫెక్ట్ అయ్యేట్లు కనిపించడం లేదు.













