శ్రీ విష్ణు కొత్త చిత్రం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలీ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వ టీమ్ సభ్యుడు హాసిత్ గోలి డైరెక్షన్ చేస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. శ్రీవిష్ణు హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగిన వారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని, ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, కీర్తి చౌదరి.













