మరో స్టార్ హీరోతో ఏషియన్ సినిమాస్ బిజినెస్
టాలీవుడ్ బిగ్ షాట్స్ లో ఒకరైన సునీల్ నారంగ్ కు తెలంగాణలోనే మేజర్ థియేటర్లు ఆయన చేతిలో ఉన్నాయి. సొంతంగా కొన్ని థియేటర్లను నిర్మించిన ఆయన, మరికొన్ని థియేటర్లను రెంట్ కు తీసుకుని వాటిని రెనోవెట్ చేసి వాటి రూపురేఖల్నే మార్చేశాడు. వీటితో పాటూ సెలబ్రిటీలతో మల్టీప్లెక్స్ లు నిర్మించి వాటికి మంచి క్రేజ్ తీసుకొస్తున్నారు ఏషియన్స్ సంస్థ బృందం.
హైదరాబాద్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వాళ్లు నిర్మించిన ఏఎంబీ బ్లాక్ బస్టర్ మల్టీప్లెక్స్ గా మారింది. ఆ మల్టీప్లెక్స్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు మంచి డిమాండ్ తో నడుస్తోంది. ఎన్నో ప్రెస్ మీట్లకు సైతం అదే వేదికైంది. అది కాకుండా విజయ్ దేవరకొండతో మహబూబ్‌నగర్ లో ఏవీడీ సినిమాస్ అనే పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించి అక్కడ కూడా సక్సెస్ అయ్యారు.
రీసెంట్ గా అమీర్‌పేటలో అల్లుఅర్జున్ తో కలిసి ఏఏఏ సినిమాస్ అంటూ స్టార్ట్ చేసింది ఏషియన్ సినిమాస్. ఇప్పటివరకు తెలంగాణలోనే మల్టీప్లెక్స్ నిర్మాణం చేసిన ఏషియన్ సినిమాస్, ఇకపై తమిళనాడు లో కూడా తమ సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఓ భారీ మల్టీప్లెక్స్ ను నిర్మించాలని ఏషియన్స్ వాళ్లు నిర్ణయించుకున్నారు.
ఈ మల్టీప్లెక్స్ కోసం ఏషియన్ సంస్థ అక్కడి యంగ్ హీరో శివ కార్తికేయన్‌తో కొలాబొరేట్ కాబోతున్నారు. ఆయనతో ఏషియన్ వాళ్లకు ప్రిన్స్ మూవీ చేసినప్పుడు మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ బాండింగ్‌తోనే ఇప్పుడు బిజినెస్ లోకి దిగుతున్నారు. చూస్తుంటే ఏషియన్ సినిమాస్ భారత దేశమంతటా తమ బ్రాండింగ్ ను విస్తరించేలా కనిపిస్తోంది.













