Arjun: సీతాపయనం వెనుక ఎన్నో ఇబ్బందులు
యాక్షన్ కింగ్ గా అర్జున్(arjun) తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితులే. ఇప్పుడాయన కూతుర్ని తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, ఆయన దర్శకత్వం వహిస్తూ ఓ సినిమా చేస్తున్నారు. అదే సీతాపయనం(Seetha Payanam). కూతుర్ని చాలా గ్రాండ్ గా టాలీవుడ్ లోకి లాంచ్ చేయాలని డిసైడ్ అయిన అర్జున్ అందులో భాగంగానే ప్రయత్నించి విశ్వక్ సేన్(Viswaksen) హీరోగా సినిమాను అనౌన్స్ చేసి పవన్ కళ్యాణ్ తో క్లాప్ కొట్టించి సినిమాను మొదలుపెట్టారు కూడా.
కానీ కొన్ని కారణాల వల్ల విశ్వక్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో సినిమా లేటైంది. విశ్వక్ తప్పుకున్న తర్వాత తనకెంతో సమస్య వచ్చిందని, ఒక హీరో చేసిన ప్రాజెక్టులో మరొకరు నటించడానికి అందరూ ఇష్టం చూపించరని, తర్వాత తాను టాలీవుడ్లోని పలువురు హీరోలను కలిశానని, కానీ ఎవరూ చేయడానికి ముందుకు రాలేదని, తాను కూడా ఈ విషయంలో వాళ్లను ఇబ్బంది పెట్టదలచుకోలేదని చెప్పారు.
ఆఖరికి ఆరేడు నెలల తర్వాత నిరంజన్(Niranjan) హీరోగా సినిమాను పట్టాలెక్కించామని, నిరంజన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాక అతను తప్ప మరెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయేవాడనిపించిందిని, అందుకే ఏం జరిగినా మన మంచికే అనుకుంటానని అర్జున్ చెప్పారు. తన జీవితంలో ఎన్నో జరిగాయని, అందులో విశ్వక్ తో జరిగిన వివాదం ఒకటి మాత్రమేనని అర్జున్ తెలిపారు. కాగా సీతాపయనం సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.













