AA22: అల్లు అర్జున్-అట్లీ మూవీ లేటెస్ట్ అప్డేట్
పుష్ప(Pushpa) సిరీస్ సినిమాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ను తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun). పుష్ప2(pushoa2) తర్వాత బన్నీ(bunny) ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో అట్లీ(Atlee) దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిన బన్నీ, ప్రస్తుతం ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్22(Allu Arjun22) వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.
ఈ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తుండగా, ఇప్పుడీ మూవీ గురించి ఓ అప్డేట్ తెలుస్తోంది. ఈ మూవీ కోసం అట్లీ ఓ లెంగ్తీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడని, దాని కోసం రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో ఓ భారీ సెట్ ను కూడా వేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ షెడ్యూల్ లో బన్నీ పై యాక్షన్ సీన్స్ తో పాటూ ఓ సాంగ్ ను కూడా షూట్ చేయనున్నారట.
అట్లీ ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ కథ ఉంటుందని అంటున్నారు. బన్నీ ఈ మూవీలో మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడని వార్తలొస్తున్నాయి. దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీ కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పని చేస్తుండగా, సన్ పిక్చర్స్(Sun Pictures) సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.













