AA22: అల్లు అర్జున్- అట్లీ మూవీ లేటెస్ట్ అప్డేట్

పుష్ప2(pushpa2) తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) తన తర్వాతి సినిమాను అట్లీ(Atlee)తో చేస్తున్న సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ తోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ వార్త వచ్చినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్- అట్లీ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట జోరుగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఆ పనుల్ని పూర్తి చేయనుండగా, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తవగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. అందులో భాగంగానే మొదటి షెడ్యూల్ ముంబైలో జరగనుండగా, ఆ షెడ్యూల్ మూడు నెలల పాటూ అక్కడే జరగనుందని తెలుస్తోంది. బన్నీ కెరీర్లోనే ఈ షెడ్యూల్ అతి పెద్ద అవుట్ డోర్ షెడ్యూల్ అని తెలుస్తోంది.
ఈ సినిమా షెడ్యూల్ కోసం బన్నీ మూడు నెలల పాటూ ముంబైలోనే ఉండనున్నాడని, ఈ షెడ్యూల్ లో అట్లీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ మొత్తం అమెరికా వెళ్లనుందని, అక్కడ వీఎఫ్ఎక్స్ సంబంధింత సీన్స్ ను తెరకెక్కించనున్నారని టాక్. సన్ పిక్చర్స్(sun pictures) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె(Deepika padukone) హీరోయిన్ గా నటిస్తోంది.