తన బయోపిక్ చేస్తే ఆ టైటిటే పెడతా అంటున్న తాప్సీ
రాఘవేంద్ర రావు మెచ్చిన హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పెద్దగా హిట్స్ లేకపోయినా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ లో చాలా బిజీ హీరోయిన్ అయిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తాప్సీ పెట్టింది పేరన్నట్లుగా నిలిచిన తాప్సీ వరుసగా సక్సెస్‌లను అందుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తోంది.
ఓ వైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే సౌత్ లో కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది తాప్సీ. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ రీసెంట్ గా ఓ చిట్ చాట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. తన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా చక్ దే ఇండియా అని చెప్పిన తాప్సీకి చిన్నప్పటి నుంచి హృతిక్ రోషన్, జాన్ అబ్రహం అంటే ఎంతో ఇష్టమని తెలిపింది.
అంతే కాదు తన ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం అని, ఆయన దర్శకత్వంలో ఓ సినిమా అయినా చేయాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది తాప్సీ. తన గురించి చాలా మందికి తెలియని విషయం తనకు నిద్రంటే ఎంతో ఇష్టమని. తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తాప్సీ, తన బయోపిక్‌ను తీస్తే మాత్రం దానికి ఐ యామ్ డిఫికల్ట్ అనే టైటిల్‌ను పెడతానని పేర్కొంది.













