96 Sequel: ఆ సీక్వెల్ అంత ఈజీ కాదు
ఒకప్పుడు ప్రేమ ఫెయిలవడమే క్లైమాక్స్ గా చూపించే వారు. కానీ ఇప్పుడు దాన్నే మొదలుగా చేసుకుని కథలు రాసుకుంటున్నారు. తమకు ఆడియన్ ఇచ్చిన రెండున్నర గంటల టైమ్ లో తమ క్రియేటివిటీతో సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో లవ్‌స్టోరీలను సినిమాలుగా చూశాం. కానీ 2018లో వచ్చిన 96 సినిమా మాత్రం సంథింగ్ స్పెషల్ గా నిలిచింది.
ప్రేమ్ కుమార్(Prem Kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగా నచ్చింది. స్కూల్ ఏజ్ లవ్ ని డైరెక్టర్ ఎంతో అందంగా తెరకెక్కించాడు. అయితే ఈ కథ సక్సెస్ స్టోరీ కాదు. విరహంతో కూడిన లవ్ స్టోరీ. దాన్ని కూడా డైరెక్టర్ ఎంతో గొప్పగా తెరకెక్కించాడు. రీసెంట్ గా మేయలగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రేమ్ కుమార్ తన నెక్ట్స్ సినిమాగా 96కు సీక్వెల్ రానుందని చెప్పాడు.
దీంతో 96(96 Sequel) కథకు కొనసాగింపు ఎలా ఉంటుంది? ఏం ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. స్కూల్ ఏజ్ లవ్, హీరో హీరోయిన్ విడిపోయి చాలా ఏళ్ల తర్వాత కలుస్తారు. అప్పటికి హీరోయిన్ పెళ్లి అయిపోతుంది. కానీ హీరో అలా ఒంటరిగా ఉంటాడు. ఇలాంటి కథను ఎలా కొనసాగిస్తాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నార్మల్ గా కథలను కొనసాగించడం వేరు. లవ్ స్టోరీకి సీక్వెల్ రాయడం వేరు. ఏదేమైనా 96 సీక్వెల్ అనేది అంత ఈజీ కాదనేది మాత్రం అర్థమవుతుంది.













