వేడుకగా గ్రామీ సందడి
అమెరికాలోని లాస్ఏంజిల్స్ 61వ గ్రామీ అవార్డుల వేడుక ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. లాస్ఏంజిల్స్ స్టేపుల్స్ సెంటర్లో జరిగిన ఈ వేడుకలో పాప్ సింగర్ లేడీ గాగా, జెన్నిఫర్ లోపెజ్‌లు సందడి చేసి ఆహుతులను అలరించారు. అయితే ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా స్పెషల్ గెస్ట్‌గా రావడం విశేషం. ఈ వేడుకలో దిస్ ఈజ్ అమెరికా.. పాట సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. స్టార్ సింగర్ డొనాల్డ్ మెక్ కిన్లే గ్లోవర్ ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ అల్బమ్ నాలుగు కేటగిరీల్లో అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ పాల్గొని మైమరపించారు. అదేవిధంగా ఈ వేడుకకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ తన కుమార్తెతో కలిసి హాజరయ్యారు. పలువురు స్టార్ సింగర్స్‌లో గ్రామీ అవార్డుల వేడుకలో పాల్గొని సంగీత ప్రియులను అలరించారు.













