3 Roses Season 2: “త్రీ రోజెస్” సీజన్ 2ను ప్రేక్షకులకు రీచ్ చేయడంలో ఎస్ కేఎన్ సక్సెస్ అయ్యాడు – డైరెక్టర్ మారుతి
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, సూర్య శ్రీనివాస్ , సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఆహా ఒరిజినల్స్ వెబ్ సిరీస్ “త్రీ రోజెస్”. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఈ రోజు ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటి ఇనయ సుల్తానా మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 2 ట్రైలర్ లో మీరు చూసిన ఫన్ చాలా తక్కువ. సిరీస్ లో కంప్లీట్ ఎంటర్ టైన్ అవుతారు. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తున్న ఎస్ కేఎన్ కు థ్యాంక్స్. ఈ సిరీస్ చేస్తున్నప్పుడు యాక్టర్ సత్య చాలా సపోర్ట్ చేశారు. అన్నారు.
ఆహా సీఈవో రవికాంత్ మాట్లాడుతూ – ఈ ఇయర్ ఆహాలో ఎగ్జైటింగ్ కంటెంట్ అందించాం. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4, చెఫ్ మంత్ర, చిరంజీవి, కె ర్యాంప్..ఇలా వరుసగా సక్సెస్ ఫుల్ మూవీస్, షోస్, వెబ్ సిరీస్ లతో మీ ఆదరణ పొందాం. “త్రీ రోజెస్” సీజన్ 2 ఈ ఏడాది మా ఆహాకు కేక్ మీద చెర్రీ లాంటిది. ఈ హాలీడే సీజన్ ను “త్రీ రోజెస్” సీజన్ 2 తో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ – వెబ్ సిరీస్ గానీ మూవీ గానీ ఫస్ట్ కంటెంట్ చూడగానే నాకు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ ఎలా ఉంటుందనేది తెలిసిపోతుంది. సేవ్ ది టైగర్స్, ఆయ్ కు అలాగే విజయాన్ని ఊహించగలిగాను. “త్రీ రోజెస్” సీజన్ 2 పైలట్ ఎపిసోడ్ చూసినప్పుడే ఇది సక్సెస్ అని అర్థమైంది. ఈ సిరీస్ కోసం మంచి సాంగ్స్ చేశాం. ఒక కొరియన్ పాట కూడా కంపోజ్ చేయడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. అన్నారు.
రైటర్ సందీప్ బొల్ల మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 2 కు వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఎస్ కేఎన్ కు ఏ కంటెంట్ ఎవరికి రీచ్ చేయాలి, టార్గెట్ ఆడియెన్స్ ఎవరు అనేది క్లియర్ గా తెలుసు. మారుతి గారు ఒకవైపు రాజా సాబ్ లాంటి పెద్ద సినిమా చేస్తూనే మాకు సపోర్ట్ అందించారు. త్రీ రోజెస్ గా చేసిన ముగ్గురు ఇషా, రాశీ, కుషిత తమ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. అన్నారు.
యాక్టర్ సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 2లో ఈషాతో కాంబినేషన్ సీన్స్ చేశాను. తను మంచి కోస్టార్. మారుతి గారు ప్రొడ్యూసర్ గా చేస్తూ మాలాంటి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎస్ కేఎన్ తను చేసిన ప్రాజెక్ట్ కంటెంట్ చివరి ప్రేక్షకుడి దాకా రీచ్ అయ్యేలా తీసుకెళ్తారు. ఆయన చేస్తున్నారంటే ఆ మూవీ, వెబ్ సిరీస్ హిట్ అయినట్లే అనుకోవాలి. అన్నారు.
నటి బాంధవి శ్రీధర్ మాట్లాడుతూ – మూడేళ్ల క్రితం మసూద సినిమాలో నటించి మీ ఆదరణ పొందాను. మళ్లీ ఇప్పుడు ఈ సిరీస్ ద్వారా మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సిరీస్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. త్రీ రోజెస్ గా నటించిన ఈషా, రాశీ, కుషిత తమ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. అన్నారు.
హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 1 ను మించే ఫన్ ఈ సీజన్ 2లో చూస్తారు. ఈ వెబ్ సిరీస్ చాలా బాగా వచ్చింది. నేను “త్రీ రోజెస్” సీజన్ 2 షూటింగ్ ను పిక్నిలా ఫీల్ అయ్యా. రైటర్ సందీప్ నేను తెలుగు డైలాగ్స్ అర్థం చేసుకునేందుకు చాలా హెల్ప్ చేశాడు. ఎస్ కేఎన్ గారు అంటే వైరల్ కంటెంట్ అని అర్థం. అలాగే మారుతి గారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నా. ఈ నెల 13న ఆహాలో “త్రీ రోజెస్” సీజన్ 2 సీజన్ చూడండి. మీరు బాగా ఎంటర్ టైన్ అవుతారు. రోలర్ కోస్టర్ రైడ్ లా సిరీస్ అంతా ఉంటుంది. ముగ్గురు అమ్మాయిలు మూడు ఫిల్లర్స్ లా ఈ సిరీస్ కు ఉంటారు. మా డైరెక్టర్ కిరణ్ ఈ క్యారెక్టర్ చేసేందుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సిరీస్ చేస్తున్నప్పుడు ఈషా, కుషిత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అన్నారు.
హీరోయిన్ రూపా కొడవయూర్ మాట్లాడుతూ – ఎస్ కేఎన్ తన ప్రాజెక్ట్స్ ను వైరల్ అయ్యేలా ప్రమోట్ చేస్తారు. త్రీ రోజెస్ లో ఫస్ట్ ఈషా గురించి చెప్పాలి. యూత్ కు నచ్చే ఇలాంటి వెబ్ సిరీస్ చేస్తూనే మరోవైపు ఓం శాంతి..లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తోంది. తెలుగు అమ్మాయిలకు ఈషా రెబ్బా ఒక ఇన్సిపిరేషన్. రాశీ సింగ్ తెలుగులోనే కాదు హిందీలోనూ వైరల్ అవుతోంది. కుషిత సోషల్ మీడియా నుంచి ఇక్కడిదాకా ఇన్స్ పైరింగ్ జర్నీ చేస్తోంది. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
నటి ప్రగతి మాట్లాడుతూ – నేను సినిమాలు మానేయలేదు. చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేశా. మన దేశం జెండా వేసుకుని ఏషియన్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చా. ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో విలన్ గా నటిస్తున్నా. సినిమాలే నా జీవితం. సినిమానే నాకు అన్నీ ఇచ్చింది. సినిమాలను వదులుకోను. ఇండస్ట్రీలోనే ఉంటాను. నేను పవర్ లిఫ్టింగ్ సాధనలో జిమ్ కు వెళ్లినప్పుడు ఆ డ్రెస్ లు ఏంటి అని సోషల్ మీడియాలో తిట్టారు. చీర కట్టుకుని జిమ్ కు వెళ్లలేను కదా. సోషల్ మీడియాలో మహిళల్ని కించపరిచేలా కామెంట్ చేసే ముందు మీ ఇంట్లోనూ ఆడవాళ్లు ఉంటారని గుర్తుపెట్టుకోండి. పవర్ లిఫ్టింగ్ లో నేను సాధించిన విజయాల పట్ల విశెస్ అందించి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా పిలిచిన ఎస్ కేఎన్ గారికి థ్యాంక్స్. నేను సాధించిన మెడల్స్ ఇండస్ట్రీలోని యాక్ట్రెస్ అందరికీ అంకితమిస్తున్నా. అన్నారు.
హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ – ఒక వెబ్ సిరీస్ కు సీక్వెల్ చేస్తున్నారంటే అది ఎంత బాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ఊహించుకోవచ్చు. “త్రీ రోజెస్” సీజన్ 1 హిట్ అయ్యింది కాబట్టి సీజన్ 2 చేశారు. ఇలాంటి మంచి వెబ్ సిరీస్ ప్రేక్షకులకు రీచ్ అయ్యే ప్లాట్ ఫామ్ కూడా కావాలి. ఆహా అలాంటి వేదికను కల్పించింది. ఈ వెబ్ సిరీస్ ఐడియా మారుతి గారిది. ఈ సిరీస్ అంతా ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుంటుంది. త్రీ రోజెస్ గా నటించిన ఈషా, రాశీ, కుషితకు నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. ప్రగతి గారు పవర్ లిఫ్టింగ్ లో దేశానికి మెడల్స్ అందించడం గర్వంగా ఉంది. గతంలోలా వుమెన్ ఒకటే ప్రొఫెషన్ లో ఉండటం లేదు. సినిమా ఇండస్ట్రీలోని యాక్ట్రెస్ వివిధ రంగాల్లో తమ ప్రతిభ చూపిస్తున్నారు. వాళ్లకు కాస్త గ్యాప్ వస్తే ఏం చేస్తున్నారు, మూవీ ఆఫర్స్ లేవా అనే విమర్శలు చేయడం సరికాదు. నాకు సినిమాలతో పాటు ట్రావెలింగ్, రీడింగ్ ఇష్టం. అలాగే మరికొందరు హీరోయిన్స్ కు డైరెక్షన్ ఇష్టం. అలా వెర్సటైల్ గా ప్రయత్నిస్తున్న వుమెన్ ను రెస్పెక్ట్ చేయండి. అన్నారు.
డైరెక్టర్ కిరణ్ కె కరవల్ల మాట్లాడుతూ – మారుతి గారి ఐడియా నుంచే ఈ త్రీ రోజెస్ వెబ్ సిరీస్ మొదలైంది. ఎస్ కేఎన్ మాలాంటి డైరెక్టర్స్ కు వరం అనుకోవచ్చు. వెబ్ సిరీస్ అయినా ఒక సినిమాకు చేసినంత ప్రమోషన్ చేస్తున్నారు. ఆహా కల్పించిన అవకాశాల వల్లే మాలాంటి యంగ్ డైరెక్టర్స్ బయటకు వస్తున్నారు. త్రీ రోజెస్ సీజన్ 1 కంటే సీజన్ 2ను బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ సీజన్ చూడని వాళ్లకు కూడా ఫ్రెష్ గా సీజన్ 2 చూడొచ్చు. సీజన్ 1 థియేటర్స్ లో అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటే, సీజన్ 2 మీరు ఒక్కరైనా టీవీలో, మొబైల్ లో చూస్తూ ఎంటర్ టైన్ అవ్వొచ్చు. త్రీ రోజెస్ గా చేసిన ఈషా, రాశీ, కుషిత తమ కంప్లీట్ సపోర్ట్ ఈ సిరీస్ కు అందించారు. అన్నారు.
హీరోయిన్ కుషిత కల్లపు మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 1 సక్సెస్ తో సీజన్ పై మీరు ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ అంచనాలన్నీ మించేలా సీజన్ 2 ఉంటుంది. ఫుల్ మీమ్ కంటెంట్ ఉంది. మీకు నచ్చిన మీమ్ పోస్ట్ చేయండి. ఈ నెల 13న ఆహాలో “త్రీ రోజెస్” సీజన్ 2 చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ – “త్రీ రోజెస్” సీజన్ 2 ఈవెంట్ కు ప్రగతి గారు, సంయుక్త గారు గెస్ట్ లుగా రావడం హ్యాపీగా ఉంది. ఇది వుమెన్ షో. వుమెన్ ఎంపవర్ మెంట్ ఈ ఈవెంట్ లో కనిపిస్తోంది. ఒక వయసు వచ్చాక ఇదే చేయాలి, అదే చేయాలని అంటుంటారు. కానీ ప్రగతి గారు ఆ విమర్శలన్నీ ఎదుర్కొని నిలబడి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ గెలిచి దేశానికి పేరు తెచ్చారు. “త్రీ రోజెస్” సీజన్ 2 ఈ నెల 13న ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తోంది. సీజన్ 2 చూసే ముందు సీజన్ 1 కూడా చూడండి. మారుతి గారు, ఎస్ కేఎన్ గారు బేబి వంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసి లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న మూవీస్, సిరీస్ లు చేస్తున్నారు. నాతో రాశీ, కుషిత రోజెస్ గా నటించారు. రోజెస్ అంటే సున్నితంగా ఉంటాయని అనుకోవద్దు, ముళ్లు కూడా ఉంటాయి. ఈ సిరీస్ కు వర్క్ చేసిన టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – త్రీ రోజెస్ సీజన్ 2కు ఈషా, రాశీ, కుషితో పాటు మరో హీరో ఉన్నారు. అతనే ఎస్ కేఎన్. ఒక వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి సక్సెస్ చేశాడంటే ఎస్ కేఎన్ ను హీరోగానే చూడాలి. కరోనా టైమ్ లో ఒక ఐడియాగా ఈ కథ అనుకుని అరవింద్ గారికి చెప్పాను. అక్కడి నుంచి ఎస్ కేఎన్ ఈ ప్రాజెక్ట్ ను తన భుజాలపై వేసుకున్నాడు. డైరెక్టర్ కిరణ్ ప్రతిభ గలవాడు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు. రైటర్ సందీప్ కు మంచి ఫ్యూచర్ ఉంది. “త్రీ రోజెస్” సీజన్ 2 మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో రిచ్ గా కనిపిస్తుందంటే అందుకు మా టీమ్ అంతా పెట్టిన ఎఫర్ట్స్ కారణం. మన లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం అంటే ఇలా వారికి ఒక మంచి వేదిక కల్పించడం. వారిని సపోర్ట్ చేసేందుకు ఇంతమంది హీరోయిన్స్ గెస్ట్ లుగా రావడం సంతోషంగా ఉంది. ప్రగతి గారు మాట్లాడుతుంటే మా అందరికీ ఎమోషనల్ గా అనిపించింది. తిట్టే వాళ్లే లేకుంటే మనం ఇలా ఎదగలేం. మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం. నెగిటివిటీ పెట్టుకుని తిట్టే వాళ్ల దగ్గర అదే ఉంటుంది, ఇంకేం ఉండదు. మరో నెల రోజుల్లో మీకు కావాల్సినంత ఎగ్జైటింగ్ కంటెంట్ తో రాబోతున్నాం. ఏ సందేహం అక్కర్లేదు, మీకు రాజా సాబ్ నుంచి కావాల్సినవన్నీ అందిస్తాం. అన్నారు.
నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – త్రీ రోజెస్ సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన సంయుక్త గారికి థ్యాంక్స్. నా నెక్ట్స్ మూవీస్ లో హీరోయిన్స్ గా హారిక, రూపా, బాంధవి చేయబోతున్నారు. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో వీళ్లందరికీ అవకాశాలు కల్పిస్తున్నా. మిగతా ప్రొడ్యూసర్స్ ఎందుకు చేయడం లేదో నాకు తెలియదు వాళ్లకున్న సమస్యలు వాళ్లకు ఉంటాయి కానీ నేను సాధ్యమైనంత వరకు తెలుగు అమ్మాయిలనే హీరోయిన్స్ గా సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నా. డైరెక్టర్ కిరణ్ ఇకపై మాతో ట్రావెల్ చేస్తాడు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాడు. అలాగే రైటర్ సందీప్ ను డైరెక్టర్ ను చేయబోతున్నా. త్వరలోనే ఆయనతో ఒక మూవీ నిర్మిస్తా. త్రీ రోజెస్ సీజన్ 2 ను ఈ నెల 12న రిలీజ్ చేయాలని అనుకున్నాం అయితే ఆ రోజు బాలకృష్ణ గారి అఖండ 2 రిలీజ్ అవుతోంది. ఆ సినిమా కోసం మా సిరీస్ ను ఒకరోజు తర్వాత ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాం. మా టీమ్ అంతా అఖండ2 సినిమా చూస్తూ చిల్ కాబోతున్నాం. అందరి సినిమాలు బాగుండాలి. తమన్ రీసెంట్ గా అఖండ 2 నుంచి ఒక చిన్న బీజీఎం వినిపించాడు. అదిరిపోయింది. త్రీ రోజెస్ సీజన్ 3 ని సినిమాగా చేయబోతున్నాం. ప్రగతి గారు సాధించిన విజయాన్ని మనమంతా సెలబ్రేట్ చేసుకోవాలి. 180 దేశాలు పాల్గొన్న ఏషియన్ గేమ్స్ లో ఇండియాకు పవర్ లిఫ్టింగ్ లో ఆమె నాలుగు మెడల్స్ సాధించారు. ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ లో దేశాన్ని నిలిపారు. ఈ థియేటర్ లోనే 50, 75 రూపాయలకు టికెట్ కొని సినిమాలు చూసిన ఒక మధ్య తరగతి ప్రేక్షకుడిని నేను. ప్రేక్షకులను నేను అర్థం చేసుకోగలను. అందుకే నా సినిమాల టికెట్ రేట్స్ అందరికీ అందుబాటులో ఉంచుతున్నాను. అన్నారు.






