విడాకులకు సిద్ధమైన మరో స్టార్ కపుల్

హాలీవుడ్ ప్రముఖ స్టార్ కపుల్ కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ విడిపోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. రెండేళ్ల డేటింగ్ తర్వాత 2014లో ఇటలీ వేదికగా వివాహం చేసుకున్న ఈ జంట ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే కిమ్ కర్దాషియాన్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఇక కేస్‍కు ఇది మొదటిసారి విడాకులు కాగా, కిమ్‍కు ఇది మూడోవది. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
మోస్ట్ పాపులర్ స్టార్ కపుల్‍గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కిమ్, కేన్‍కు కొన్నాళ్లుగా పొసగడం లేదు. ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. కిమ్ కర్దాషియాన్ తన పిల్లల్ని తీసుకొని లాస్ ఏంజెల్స్లో ఉంటుండగా.. కేన్ వెస్ట్ ప్రస్తుతం వోమింగ్‍లో ఒంటరిగా ఉంటున్నారు. గతంలో కేన్.. కిమ్‍తో పాటు ఆమె తల్లి కన్ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రవర్తన బాధ కలిగిస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ దంతతులకు నార్త్(7), సెయింట్(5)తో పాటు 21 నెలల కుమారుడు కూడా ఉన్నాడు.