అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది
అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. బైడెన్ పరోక్షంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం స్వార్థం కోసం రాజకీయ హింసను వ్యాపింపచేస్తున్నారని బైడెన్ ఆరోపించారు. కోపం, ద్వేషం, హింసను ప్రేరేపించడానికి పదే పదే అబద్దాలు చెపుతున్నారని ఆయన విమర్శించారు. ఈ అబద్ధాలను నిజంతో ఎదుర్కొవాలని, దీని పైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. రిపబ్లికన్లు అయినా, డెమోక్రాట్లు అయినా వోటర్లపై బెదరింపులకు, రాజకీయ హింసకు దారి లేదని బైడెన్ అన్నారు. రాజకీయ హింస, ప్రజాస్వామ్యానికి బెదరింపులు అన్న అంశంపై వైట్‌హౌస్ లో మాట్లాడుతూ బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.






