లిజ్ ట్రస్ తప్పు చేశారు : జో బైడెన్
బ్రిటన్ ప్రధాని లిజ్‌ట్రస్ ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పు పట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధనవంతులపై పన్నులు తగ్గించడం ఘోర తప్పిదమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో బ్రిటన్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు అమెరికా ప్రయోజనాలకూ నష్టం కలిగిస్తాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఓరెగాన్‌లో బైడెన్ మాట్లాడుతూ మినీ బడ్జెట్ తప్పని నేను ఒక్కడినే అనుకోవడం లేదు. బ్రిటన్ విధానాలతో ఏకీభవించడం లేదు అని అన్నారు. యూఎస్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న బైడెన్, మిగతా దేశాలే సరైన ఆర్థిక విధానాలు అనుసరించడం లేదని ఆక్షేపించారు.






