నాకు ఆయనతో సమావేశమయ్యే ఉద్దేశం లేదు : బైడెన్
ఉక్రెయిన్ సంక్షోభంతో అమెరికా, రష్యా మధ్య సంబంధాలు క్షీణించాయి. ఒకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు హెచ్చరికలు చేస్తుంటే అంతర్జాతీయంగా పుతిన్ మరింత ఒంటరి అవుతారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడితో సమావేశంపై బైడెన్ స్పందించారు. నాకు ఆయనతో సమావేశమయ్యే ఉద్దేశం లేదు. కానీ సమావేశం కావాలనుకంటే అది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. జీ 20 సదస్సులో భాగంగా రష్యాలో నిర్బంధంలో ఉన్న బ్రిట్నీ గ్రినర్ విడుదల గురించి పుతిన్ మాట్లాడాలనుకుంటే నేను ఆయనతో సమావేశం అవుతాను. ఆ మీటింగ్ ఆయన మాట్లాడే అంశంపై ఆధారపడి ఉంటుందని అని వెల్లడించారు.






