సునాక్ ఎన్నిక కీలక మైలురాయి
యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నిక ఆశ్చర్యకరమైందని, కీలక మైలురాయిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న బైడెన్ వెలుగుల పండుగకు మనలో చీకటిని పారద్రోలి ప్రపంచానికి వెలుగునిచ్చే శక్తి ఉందన్నారు. అమెరికాలో లేదా భారతదేశంలో కుటుంబాలకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో సునాక్ ఎంపిక ఆశ్చర్యకరమైన కీలక పరిణామంగా పేర్కొన్నారు. యూకే ప్రధానమంత్రిగా రిషి సునాక్ రెండు వందల మంది అధికార టోరీ పార్టీ ఎంపీల ఎంపికగా తెలిపారు. కాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ 2020లో తన సహచర అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ను ఎంపిక చేసి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. బైడెన్ తరువాత రెండో కీలక వ్యక్తిగా హ్యారిస్ కొనసాగుతున్నారు.






