అమెరికాలో బంగ్లాదేశ్ సీఈవో దారుణహత్య

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బంగ్లాదేశ్‍కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. రవాణా, పుడ్ డెలివరీ సేవలు అందించే సంస్థ సహవ్యవస్థాపకుడు ఫాహిమ్ సలేహ్‍ను తన విలాసవంతమైన ఫ్లాట్‍లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయన సోదరి అక్కడకు వచ్చే సరికి ఫాహిమ్ మృతదేహాన్ని దుండగులు ముక్కలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరు చూసి ఎవరో అనుభవం ఉన్న హంతకులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫాహిమ్ సోదరి అక్కడకు వచ్చే వరకు హంతకుడు ఫ్లాట్‍లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమె రాకతో అలికిడి కావడంతో నిందితులు పారిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరా పుటేజీకి పరిశీలించగా ఒక వ్యక్తి ఫాహిమ్ వెనుకనే వచ్చినట్లు గుర్తించారు.